ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్‌ని పెళ్లాడి గత ఏప్రిల్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. ఆ చిన్నారి ఫోటోను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో కాజల్ అగర్వాల్ చాలా గ్యాప్ తర్వాత చెన్నై వస్తున్నారని, ఆమె పాత్ర షూటింగ్ చెన్నైలో ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.గ్లోబల్ హీరో కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన 'ఇండియన్ 2'లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. పలు కారణాలతో గత రెండేళ్లుగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ఈ పరిస్థితిలో ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ చెన్నైకి వస్తోంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో మీడియాతో సమావేశమైన కాజల్ అగర్వాల్.. ‘ఇండియన్ 2’ షూటింగ్ కోసం చెన్నై వెళ్తున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ నటించనని చెప్పగా ‘ఇండియన్ 2’తో పాటు ఇప్పటికే కమిట్ అయిన సినిమాల్లో నటించాలని నిర్ణయించుకోవడం గమనార్హం.