నిఖిల్ హీరోగా నటించిన సినిమా 'కార్తికేయ-2'. ఈ సినిమాలో హీరోయినిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఇటీవల ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన హీరోయిన్ అనుపమ ఎమోషనల్ అయింది. సినిమా హిట్టయినా ఎందుకు సంతోషంగా లేరని హీరో నిఖిల్ సహా చాలా మంది అడుగుతున్నారని చెప్పింది. కానీ ఈ సినిమా కోసం చేసిన జర్నీ అయిపోయింది అనిపించే సరికి బాధగా అనిపిస్తుంది.ఆ బాధ వల్లే ఈ హిట్‌ని ఆస్వాదించలేకపోతున్నాను అని తెలిపింది.