సినీ ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్‌ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గత నెల 31న స్థానిక మధురవాయిల్లో హిందువుల రక్షణ కోసం హిందూ మున్నాని సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో కనల్ కణ్ణన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడిపై నమ్మకం లేని పెరియార్ విగ్రహాన్ని శ్రీరంగం ఆలయం ముందు బద్దలు కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తండై పెరియార్ ద్రవిడ, చెన్నై జిల్లా కార్యదర్శి కుమరన్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.వీడియో ఆధారాలను పరిశీలించిన చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో కణల్ కన్నన్ పరారయ్యారు. 13 రోజుల తర్వాత అతడు పుదుచ్చేరిలో తలదాచుకున్నాడని సమాచారం అందుకున్న చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడికి వెళ్లి సోమవారం కనల్ కణ్ణన్‌ను అరెస్టు చేసి చెన్నైకి తీసుకొచ్చారు.