సత్యదేవ్ హీరోగా నటిస్తున్న "కృష్ణమ్మ" నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. కాలభైరవ స్వరపరిచిన "ఏమవుతుందో మనలో" అనే పాటను ఆగస్టు 19వ తేదీ ఉదయం 10:08గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు తెలిపారు. ఈ పాటను టాప్ సింగర్ సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు.
వి గోపాలకృష్ణ డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీని అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ సమర్పించడం విశేషం.