నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందు మొండేటి డైరెక్షన్లో ఇండియాస్ మిస్టికల్ ఎడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం "కార్తికేయ 2". శనివారం విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ సినిమాకు విశేష స్పందన వస్తుంది.
హిందీ నాట 60 థియేటర్లతో మొదలైన కార్తికేయ స్క్రీనింగ్ రోజురోజుకూ 300, 500 ఇలా పెరుగుతూ వస్తుంది. తాజాగా కార్తికేయ 2 చిత్రం దేశవ్యాప్తంగా 1600 థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఒక చిన్న సినిమాకు ఇన్ని ధియేటర్లంటే నిజంగా మాటలు కాదు. కార్తికేయ బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తే, ఖచ్చితంగా త్వరలోనే టాలీవుడ్ కి మరొక మాస్సివ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుతుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందించారు.