ఇటీవల విడుదలై హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లలో రన్ అవుతున్న సినిమా "కార్తికేయ 2". చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది.
లేటెస్ట్ గా కార్తికేయ 2 మూవీ టీం కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హార్టీ కంగ్రాట్యులేషన్స్ చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ షేర్ చేసారు. ఈ సందర్భంగా ప్రభాస్ కార్తికేయ 2 లో నటించిన నటీనటులకు, డైరెక్టర్, నిర్మాతలకు, సాంకేతిక బృందానికి బెస్ట్ విషెస్ తెలియ చేసారు. ప్రభాస్ నుండి కాంప్లిమెంట్స్ రావడం కార్తికేయ 2 కు మరింత ప్లస్ అవుతుంది.
పోతే, ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.