దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ప్రతిబింబాలు' సినిమా 40 ఏళ్ల తర్వాత విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ హీరోయిన్ గా నటించింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ ఈ సినిమాను రూపొందించారు. అనివార్య కారణాల వల్ల అప్పట్లో విడుదల కాని ఈ సినిమాను సరికొత్త హంగులతో సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. అయితే అప్పట్లో ఈ చిత్రం కంప్లీట్ అయినా కూడా పలు కారణాల చేత రిలీజ్ కి నోచుకోలేదట.