2012 నుండి ప్రారంభమైన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ప్రధానోత్సవం ఈ ఏడాది సెప్టెంబర్ 10,11 తేదీలలో బెంగుళూరులో జరగబోతున్నాయి.
ప్రస్తుతానికి సైమా అవార్డ్స్ నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇందులో తెలుగు కేటగిరీ నుండి నాలుగు సినిమాలు ఫుల్ హవా చూపించాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన "అఖండ" 10 నామినేషన్స్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" 12 నామినేషన్స్ , నవీన్ పోలిశెట్టి నటించిన "జాతిరత్నాలు" 8 నామినేషన్స్ , మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డిబట్ మూవీ "ఉప్పెన" 8 నామినేషన్స్... ఈ నాలుగు సినిమాలు కూడా హైయెస్ట్ నామినేషన్స్ తో సత్తా చాటాయి. మరి ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా ఎన్ని అవార్డులు రాబడుతుందో చూడాలి.