త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జీ తెలుగు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.