మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ షాకిచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్ ను ఈడీ నిందితురాలిగా చేర్చింది. దోపిడీ చేసిన డబ్బు నుంచి జాక్వెలిన్ అత్యంత ఖరీదైన వస్తువులను పొందినట్లు దర్యాప్తులో గుర్తించారు. సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీదారు అని జాక్వెలిన్ కు ముందే తెలుసని ఈడీ తెలిపింది.