సుధీర్ వర్మ దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ నివేదా థామస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ రెజీనా కసాండ్రా సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కామెడీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'శాకిని డాకిని' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ మరియు క్రాస్ పిక్చర్స్ ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ కొరియన్ డ్రామా యొక్క రీమేక్ సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, విప్లవ్ నిషాదమ్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మైకీ ఎంసీ క్లియరీ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.