లైగర్ మేకర్స్ కొంచెంసేపటి క్రితమే స్పెషల్ సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ చేసారు. రేపు లైగర్ మూవీ నుండి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు చెప్పి ఫ్యాన్స్ ను థ్రిల్ కు గురి చేసారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో పక్కా మాస్ మసాలా మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్త బ్యానర్లపై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోతే, ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతుంది.