ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన "RRR" లో సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ఎం ఎం కీరవాణి స్వరపరిచిన ఈ మూవీ పాటలు మనసుకు హత్తుకునే మ్యూజిక్ తో, అద్భుతమైన లిరిక్స్ తో ప్రేక్షకుల ఫేవరెట్ ఆల్బంగా నిలిచాయి.
ఈ సినిమాలోని కొమురం భీముడో సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటలో తారక్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి.
ఇటీవల రాజమౌళి ఒక పాడ్ క్యాస్ట్ లో పాల్గొని ఈ పాట వెనుక ఉన్న ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ మెల్ గిబ్సన్ "బ్రేవ్ హార్ట్" క్లైమాక్స్ నుండి ఇన్స్పిరేషన్ పొంది RRR సెకండ్ హాఫ్ లోని కొమురం భీముడో సాంగ్ ను పిక్చరైజ్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళి తనను తాను ఏకలవ్యుడిగా, గిబ్సన్ ను ద్రోణాచార్యుడిగా పోల్చడం విశేషం.