నిఖిల్ సిద్దార్ధ్ కొత్త చిత్రం 'కార్తికేయ2'. చందు మొండేటి డైరెక్షన్లో నిఖిల్ హీరోగా చేసిన కార్తికేయ కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు.
లేటెస్ట్ కార్తికేయ 2 మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఈ మూవీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) రిలీజ్ పై అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. ఈ వారంలోనే ఈ మూవీ OST రిలీజ్ అవుతుందని, ముందుగా ట్రాన్స్, ఫ్లూట్ థీమ్, జ్యూక్ బాక్స్ ... ఈ క్రమంలో విడుదల చేస్తామని ప్రకటించారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. నార్త్ బెల్ట్ లో ఎలాంటి ప్రచారం చేయకున్నా ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు విశేషాసక్తి చూపిస్తున్నారు.
![]() |
![]() |