యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే RRR సినిమాలో భీమ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి గ్రాండ్ పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్నారు. RRR కు ముందు తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మొదటి సారిగా నటిస్తూ "అరవిందసమేత వీరరాఘవ" సినిమాలో నటించారు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్. తారక్ సినీ కెరీర్ లో జరిగిన ఇదే సిట్యుయేషన్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా జరగబోతుంది.
అదేంటంటే, పరశురామ్ డైరెక్షన్లో "సర్కారువారిపాట" సినిమాను చేసిన మహేష్ లేటెస్ట్ గా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ నెల్లోనే స్టార్ట్ అవ్వాల్సింది కానీ, సమ్మె కారణంగా వాయిదా పడింది. ఈ మూవీ తదుపరి మహేష్ రాజమౌళి డైరెక్షన్లో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి కమిటైన విషయం అందరి తెలిసిందే.
తారక్ ఎలా ఐతే, త్రివిక్రమ్, రాజమౌళి లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడో ఇప్పుడు మహేష్ కూడా అలానే అందుకుంటాడని ఫ్యాన్స్ ఒక సెంటిమెంటును తెరపైకి తీసుకొస్తున్నారు. అలానే తారక్ కి ఫిజికల్ ట్రైనర్ గా వర్క్ చేసిన ల్లాయ్డ్ స్టీవెన్స్ ఇప్పుడు మహేష్ కు ట్రైనర్ గా పనిచెయ్యడం కూడా విశేషమే.
![]() |
![]() |