ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ది ఘోస్ట్" నుండి డబుల్ ధమాకా ఎనౌన్స్మెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 10:34 AM

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న చిత్రం "ది ఘోస్ట్". ఈ మూవీ నుండి "తమహగానే" అంటే ఏంటి అంటూ ఇన్నాళ్లు గ్లిమ్స్ వీడియోస్ తో ప్రేక్షకులను సస్పెన్స్ లో ఉంచిన మేకర్స్ లేటెస్ట్ గా ఆ పదం యొక్క అర్ధం తెలుపుతూ సరికొత్త వీడియోను రిలీజ్ చేసారు. తమ అంటే - విలువైనది, అమూల్యమైనది, హగానే అంటే - స్టీల్ అని అర్ధం. అమూల్యమైన స్టీల్ తో చేసిన కత్తిని ఈ సినిమాలో నాగార్జున తన ఆయుధంగా వాడతాడు.
అంతేకాక ది ఘోస్ట్ థియేట్రికల్ ట్రైలర్ ను ఆగస్టు 25వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు కూడా అధికారిక ప్రకటన చేసారు. ఇన్నాళ్లు ఎలాంటి బజ్ లేని ఈ సినిమాకు తొలి గ్లిమ్స్ తో విపరీతమైన ఆసక్తి చోటుచేసుకుందనే చెప్పాలి.
పోతే, ఈ సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com