కార్తికేయ 2 బాక్సాఫీస్ దగ్గర అదరగొ డుతోంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తుంది. తొలి రెండు రోజులు 7 లక్షలు, 28 లక్షలు వసూలు చేసిన నిఖిల్ సినిమా ఆ తర్వాత రోజు నుంచి రోజుకో కోటికి పైగా కలెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.2.73 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు.. దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్, నిఖిల్, అనుపమ పర మేశ్వరన్ ల నటన గురించి హిందీ ప్రేక్షకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అనుపమకు అప్పుడే బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ కూడా వచ్చిందట. బాలీవుడ్ లో ఓ అగ్ర నిర్మాణ సంస్థ అనుపమ పరమేశ్వరన్తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఆమెకు అదిరిపోయే స్క్రిప్టు వినిపించారని టాక్.