టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో తన తదుపరి ప్రాజెక్ట్ 'RC15' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ ఒక సినిమా ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'RC16' సినిమా కమర్షియల్ ట్రాక్ లో ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది అని మేకర్స్ వెల్లడించారు. ఈ పాన్-ఇండియన్ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ ఆక్టర్స్ కూడా కనిపించనున్నారు అని సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, డిసెంబర్ నుండి ఈ సినిమా రోలింగ్ ప్రారంభించాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవలే జెర్సీ హిందీ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన గౌతమ్ ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో మరియు నటీనటులు ఎంపికలో బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్‌విఆర్ సినిమా మరియు యువి క్రియేషన్స్‌పై ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా ఆర్‌సి 16ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి తమిళ్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.