డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఆనంద్ జే దర్శకుడిగా మరి చేస్తున్న తొలి చిత్రం "అలిపిరికి అల్లంతదూరంలో". ఈ చిత్రంలో రావణ్ నిట్టూరు, నిఖితా అలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి తిరుమల తిరుపతి వైభవాన్ని, అక్కడి ప్రజల తీరును తెలిపే సాంగ్ ను విడుదల చేసారు. తిరుపతి ఘనచరిత్రను, పవిత్రతను తెలిపే ఈ పాటను లెజెండరీ సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ మహదేవన్ తో కలిసి యువగాయకురాలు రమ్య బెహరా ఆలపించారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందించారు. కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు.
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్, రాజేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.