ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ "కోబ్రా" నుండి తరంగిణి సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 01:26 PM

కోలీవుడు సీనియర్ స్టార్ హీరో విక్రమ్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "కోబ్రా". లేటెస్ట్ గా ఈ సినిమా నుండి తరంగిణి అనే సోల్ ఫుల్ మ్యూజికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. AR రెహ్మాన్ స్వరకల్పనలో రూపొందిన ఈ పాటను సార్థక్ కళ్యాణి, మీరా సెన్గుప్తా ఆలపించగా, రాకేందు మౌళి లిరిక్స్ అందించారు.
R. అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని SS లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, KS రవికుమార్, రోబో శంకర్, మియా జార్జ్, మృణాళిని రవి, మీనాక్షి గోవిందరాజన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పోతే, ఈ చిత్రం ఆగస్టు 31వ తేదీన విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com