ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను గ్రాండుగా జరుపుకోనున్నట్టు నాగబాబు గురువారం ప్రకటించారు. గ్రాండ్ మెగా కార్నివాల్ ఈవెంట్ పేరుతో ఆగస్టు 22న జరగనుంది. చిరంజీవి మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన కార్యక్రమాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటారు అని నాగబాబు అన్నారు.