రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్న వెబ్ ఫిలిం "హైవే". ఈ చిత్రానికి KV గుహన్ డైరెక్టర్ కాగా వెంకట్ తలారి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. KV గుహన్ గతంలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసేవారు. సైమన్ కే కింగ్ సంగీతం అందిస్తున్నారు.
కంటెంట్ పరంగా ఎప్పుడూ రిచ్ నెస్ కోరుకునే తెలుగు ఓటిటి 'ఆహా'లో ఆగస్టు 19 నుండి అంటే నేటి నుండే ఈ వెబ్ ఫిలిం స్ట్రీమింగ్ కొచ్చింది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఈ వారం వాచ్ చెయ్యడానికి వన్ ఆఫ్ ది ఆప్షన్.