బాలీవుడ్ ను కుదిపేస్తున్న మీటూ ఉద్యమంలో కొందరు మంచి వారు అమాయకులు కూడా బలవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. మీటూ ఉద్యమం ముసుగులో తమకు కోపం ఉన్న వారిపై లైంగిక ఆరోపణలను చేస్తే పోయేదేమీ లేదంటూ కొందరు అమ్మాయిలు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మీటూ అంటూ ఆరోపణలు చేస్తున్న వారు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా సాక్ష్యాధారాలను చూపించలేదు. కనుక ఇందులో ఎక్కువ శాతం పబ్లిసిటీ కోసం చేస్తున్నవే అంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆ విషయాన్ని మాత్రం బయటకు అనేంత సాహసం ఎవరు చేయడం లేదు.
తాజాగా టీసిరీస్ అధినేత భూషన్ కుమార్ పై ఒక మహిళ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆ ఆరోపణలతో బాలీవుడ్ లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. భూషన్ కుమార్ ఇటువంటి వ్యక్తా అంటూ చర్చ జరుగుతున్న సమయంలో ఆయన భార్య హీరోయిన్ దివ్య ఖోస్లా ఘాటుగా స్పందించారు. తన భర్త భూషన్ కుమార్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ప్రతి విషయంలో కూడా నా భర్త విలువలను పాటించే వ్యక్తి ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసంది.
ఇంకా దివ్య ఖోస్లా ట్విట్టర్ లో... మీటూ ఉద్యమం దారి తప్పుతున్నట్లుగా అనిపిస్తుందని కొందరు కావాలని తన భర్తపై ఇలాంటి లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నట్లుగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమాత్రం మంచి పద్దతి కాదంటూ ఆమె హితవు పలికింది. ఇలాగే వదిలేస్తే వీళ్లు చివరకు శ్రీకృష్ణుడిపై కూడా నిందలు వేస్తారేమో అనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దివ్య ఖోస్లా మాత్రమే కాకుండా భూషన్ కుమార్ కు పలువురు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే భూషన్ కుమార్ తనపై ఆరోపణలు చేసిన మహిళపై కేసు పెట్టడం జరిగింది. పరువు నష్టం దావా కూడా వేసినట్లుగా సమాచారం అందుతుంది. మీటూ అనేది ఒక మంచి ఉద్యమమని ఇలా తప్పుడు ఆరోపణలు చేసి దాన్ని ఉద్దేశ్యం దెబ్బ తీయొద్దు అంటూ కొందరు సోషల్ మీడియాలో కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa