ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న "లైగర్" ప్రచార కార్యక్రమాలు ఫుల్ జోష్ గా జరుగుతున్నాయి. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా మేజర్ సిటీస్ లో వరసగా ప్రమోషన్స్ జరుపుకుంటూ వస్తున్న లైగర్ టీం ఈ రోజు బెంగుళూరులో ప్రమోషన్స్ చేయనుంది.
ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి బెంగుళూరులోని మంత్రి స్క్వేర్ మాల్ లో లైగర్ ప్రమోషన్స్ జరగబోతున్నాయి. ఈ ఈవెంట్ కు హీరో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, డైరెక్టర్ పూరి జగన్నాధ్, సహ నిర్మాత ఛార్మీ తదితరులు పాల్గొననున్నారు.
ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, రమ్య కృష్ణ, మకరంద్ దేశ్ పాండే కీలకపాత్రలు పోషించారు.