విజయ్, మురుగదాస్ కలయికలో రూపొందుతున్న చిత్రం సర్కార్. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన తుపాకి, కత్తి ఘన విజయం సాధించాయి. సర్కార్ మూడవ సినిమా. కీర్తి సురేష్, వరలక్ష్మి కథానాయికలు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిథి మారన్ నిర్మిస్తున్న చిత్రమిది. ఇటీవలే నవాబ్ చిత్రాన్ని అందించిన అశోక్ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కులను తీసుకున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన నవాబ్ హిట్ తర్వాత మురుగదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ చిత్రం అనువదిస్తున్నందుకు ఆనందంగా ఉందని అశోక్ వల్లభనేని చెప్పారు. తమిళ ఫస్ట్‌లుక్, పాటలకు మంచి స్పందన వచ్చిందని, తెలుగు అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తామని ఆయన చెప్పారు. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 6న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాం అని అశోక్ వల్లభనేని తెలిపారు. ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa