బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్ కి సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అవుతుంది. ట్విట్టర్ లో ఐతే ఈరోజే పలు మార్లు ఈ లుక్ ట్రెండింగ్ లో కొచ్చింది.
సల్మాన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ "కభీ ఈద్ కభీ దివాళి" షూటింగ్ ప్రస్తుతం లేహ్ లఢక్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో పాల్గొన్న సల్మాన్ సెట్స్ లో ఉన్న తన లేటెస్ట్ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం జరిగింది. ఈ పిక్ లో సల్మాన్ లాంగ్ షాట్ లో అదికూడా వెనకనుండి పొడవాటి జులపాల జుట్టు కనిపించే విధంగా, బ్యాక్ గ్రౌండ్ లో ఎన్ ఫీల్డ్ బైక్ ... ఈ పిక్ లో పక్కా మాస్ అవతార్ లో కనిపిస్తూ, ఫ్యాన్స్ కు సడెన్ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఈ సినిమాను ఫర్హాద్ సంజి డైరెక్ట్ చేస్తుండగా, సల్మాన్ నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa