యంగ్ హీరో సత్యదేవ్ కొత్త చిత్రం "కృష్ణమ్మ" నుండి నిన్న విడుదలైన ఫస్ట్ లిరికల్ 'ఏమవుతుందో మనలో... మన మనసులలో' సాంగ్ కు శ్రోతల నుండి మంచి స్పందన వస్తుంది. యూట్యూబులో ఈ పాటకు అప్పుడే 1.2 మిలియన్ వీక్షణలు వచ్చాయి.
సిద్ధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను కాలభైరవ స్వరపరిచారు. అనంతశ్రీరాం లిరిక్స్ అందించారు.
సత్యదేవ్, అతిరా రాజి, అర్చన, కృష్ణ బూరుగుల, లక్ష్మణ్ మీసాల తదితరులు నటించిన ఈ సినిమాను వీవీ గోపాల కృష్ణ డైరెక్ట్ చేసారు.
అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫేమస్ టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్నారు.