కోలీవుడ్ సీనియర్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రం "కోబ్రా". కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జ్ఞానముత్తు డైరెక్ట్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 31వ తేదీన విడుదల కాబోతుంది.
పోతే, ఈ చిత్రానికి AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు.