ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన కన్నడ చిత్రం 'కేజీఎఫ్ 2' తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైనట్టు తెలుస్తుంది. రేపు అంటే ఆగస్టు 21 వ తేదీ రాత్ర ఏడింటికి జీ కన్నడ ఛానెల్ లో ఈ చిత్రం టెలికాస్ట్ కానుంది. ఐతే, ఇది కేవలం కన్నడ ప్రేక్షకులకు మాత్రమే.
తెలుగులో, మరియు ఇతర భాషలలో ఈ సినిమా ఎప్పుడు బుల్లితెరపైకి వస్తుందో తెలియాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. రవి బస్రుర్ సంగీతం అందించారు.
హోంబలే ఫిలిమ్స్ అత్యంత భారీ బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలై ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.