ఇటీవల సోలోగమి(తమను తామే పెళ్లి చేసుకోవడం) చర్చనీయాంశంగా మారింది. ఓ గుజరాతీ యువతి ఇదే రీతిలో తనను తాను పెళ్లాడింది. ఆ కోవలోకి సీరియల్ నటి కనిష్క సోని చేరిపోయింది. ఇటీవల నుదుట సింధూర తిలకం, మెడలో తాళి ఉన్న ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసింది. అభిమానులు ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్‌గా మారింది. తెలుగులో ప్రసారమైన 'ఈ తరం ఇల్లాలు' అనే సీరియల్‌లో ఆమె నటించింది.