సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు షర్ట్ లేకుండా సినిమాలో ఒక్క సీన్ కానీ, ఫైట్ కానీ చెయ్యలేదు. సుకుమార్ డైరెక్ట్ చేసిన వన్ నేనొక్కడినే చిత్రంలో మహేష్ సిక్స్ ప్యాక్ చేసినా బాడీని కేవలం వెనకనుండి మాత్రమే చూపించాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం బాబు షర్ట్ లెస్ ఫైట్ ఎప్పుడెప్పుడు చేస్తాడా అని ఎదురుచూస్తుంటే, లేటెస్ట్ గా బయటకు వచ్చిన పిక్ ఒకటి ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.
మహేష్ బాబు స్విమ్ చేస్తున్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోస్ తో మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాక మిగిలిన ఆడియన్స్ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయారు. ఇంత మంచి ఫిజిక్ ఉంచుకుని ఎందుకు మహేష్ తన బాడీని ఎప్పుడూ ఎక్స్పోజ్ చెయ్యడు ? అని కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
ఏమైనా SSMB 28 షూటింగ్ స్టార్టింగ్ టైం లో ఇలాంటి పిక్ బయటకు రావడంతో ఈ సినిమాలో అయినా మహేష్ నుండి మంచి షర్ట్ లెస్ ఫైట్ ను ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చని ఆశపడుతున్నారు.