రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి పదేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ మాటను కృష్ణంరాజును అడిగితే.. ప్రభాస్ చేసుకున్నప్పుడు అని నవ్వేసి ఊరుకున్నాడు. కాగా రీసెంట్‌గా ప్రభాస్ తల్లి ఇందుకు గల కారణాన్ని తెలిపింది. ప్రభాస్‌కు రవి అని ఓ ఫ్రెండ్ ఉండేవాడని.. అతనిది లవ్ ఫెయిల్యూర్ కావడంతో అప్పటి నుంచి ప్రేమ, పెళ్లి అంటే ప్రభాస్‌కు పడదంటూ చెప్పుకొచ్చింది. లవ్ గురించి నెగెటివ్ ఒపీనియన్‌తో ఉన్నాడని బాధపడింది.