పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న "లైగర్" సినిమాను బాయ్ కాట్ చెయ్యాలని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో 'BOYCOTTLIGER' అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
నెపోటిజం విమర్శలను తీవ్రంగా ఎదుర్కొంటున్న కరణ్ నిర్మించిన చిత్రం కావడంతో ఆయన ఎదుర్కొంటున్న నెగిటివిటి సెగ ఆయన నిర్మిస్తున్న లైగర్ సినిమాకు కూడా సోకింది. దీంతో BOYCOTTLIGER, BOYYCOTTLIGERMOVIE అనే హ్యాష్ ట్యాగ్ లను కొంతమంది నెటిజన్లు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా లైగర్ బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ లకు విరుద్ధంగా సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్ లను రౌడీ హీరో డై హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ సినీ కెరీర్ జర్నీని వీడియోలు, పోస్టుల రూపంలో ప్రూఫ్ గా చూపిస్తూ చాలా కష్టపడి పై కొచ్చిన సెల్ఫ్ మేడ్ స్టార్ అని, కేవలం కరణ్ నిర్మిస్తున్న కారణంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తే, దాని ప్రభావం vd పై పడుతుందని, అలా జరిగితే, హార్డ్ వర్క్ కి మనం విలువ ఇవ్వని మనుషులమవుతామని వివరిస్తున్నారు.