గతేడాది విడుదలై సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సుకుమార్ - అల్లుఅర్జున్ ల "పుష్ప" సినిమా క్లైమాక్స్ చాలామంది ప్రేక్షకులకు వినూత్న అనుభూతుని కలిగించింది.
సాధారణంగా క్లైమాక్స్ అంటే హీరో, విలన్ మధ్య హోరాహోరీ పోరు, ఆఖరికి విలన్ మంచిగా మారి హీరోతో స్నేహంగా ఉండడం... ఇవన్నీ ఇప్పటి వరకు వచ్చిన చాలా సినిమాలలో మనం చూసినవే. కానీ పుష్ప క్లైమాక్స్ లో హీరో, విలన్ హాయిగా కూర్చుని మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాంటి ఫైట్ సీన్ ఉండదు. కొన్ని ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఈ డైలాగ్స్ తోనే పుష్ప సీక్వెల్ కు డైరెక్టర్ హిట్ ఇచ్చారు.
ఇప్పుడు ఇదే ఫార్ములాతో పూరి జగన్నాధ్ లైగర్ మూవీ క్లైమాక్స్ ను ప్లాన్ చేసారంట. ఈ విషయాన్ని స్వయంగా పూరీనే లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. పుష్ప క్లైమాక్స్ తనకు చాలా బాగా నచ్చిందని, ఇది చూసిన ప్రేక్షకులు ఒక కొత్త భావనకు లోనవుతారని, అలానే లైగర్ క్లైమాక్స్ కూడా ఇప్పటివరకు వచ్చిన సినిమాల మాదిరి కాకుండా చాలా కొత్తగా ప్లాన్ చేశామని, అది తప్పకుండా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని ఆయన చెప్పారు.