ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో గ్రాండ్ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దేశవిదేశాల్లో ఎంత మంచి పేరు వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు, డైరెక్టర్లు, నిర్మాతలు, నటీనటులు... ఆర్ ఆర్ ఆర్ ను ఒక ఎపిక్ అండ్ క్లాసిక్ మూవీలా భావిస్తున్నారు. ఈ సినిమా ఇండియాలో విడుదలైనప్పుడు ఎంతటి బజ్ ఉందో హాలీవుడ్ లో కూడా ఇప్పుడు అలాంటి బజ్జే ఉంది.
చాలామంది ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు పొందే అర్హత ఉందని, తారక్ కు ఆస్కార్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్టులు పెడుతున్నారు.
లేటెస్ట్ గా తారక్ కు ఆస్కార్ అవార్డు రావొచ్చా అనే విషయంపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ఎస్ రావాలి. మన తెలుగు నటుడికి ఆస్కార్ వచ్చిందంటే ఆ ఫీలింగ్ చాలా హై గా ఉంటుంది. తారక్ , చరణ్ ఇద్దరూ కూడా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసారు. ... అని చెప్పారు. దీంతో లైగర్ సినిమాకు తారక్ ఫ్యాన్స్ అండ ఉంటుందని అంతా అనుకుంటున్నారు.