నేటి నుండే పాన్ ఇండియా ఆడియన్స్ తీక్షణంగా ఎదురుచూస్తున్న లైగర్ ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. లైగర్ ప్రమోషన్స్ ఈవెంట్స్ కు ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నుండి వస్తున్న విశేష ఆదరణ చూస్తుంటే, ఖచ్చితంగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజికల్ నంబర్స్ ను నోట్ చేస్తుందని అంచనా.
పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ తో వస్తున్న తొలి ప్రాజెక్ట్ ఈ సినిమా. అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతుంది.