ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజాహెగ్డే అప్కమింగ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 04:48 PM

టాలీవుడ్ టాప్ సైరెన్ పూజాహెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ "కభీ ఈద్ కభీ దివాళి"షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక సాంగ్ షూటింగ్ నిమిత్తం నిన్నటివరకు లేహ్ లఢక్ లో ఉన్న మూవీ టీం లేటెస్ట్ ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తవ్వడంతో ముంబైకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ రోజు ముంబై ఎయిర్పోర్ట్ లో ఈ మూవీ హీరో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే కనిపించారు. 
ఫర్హాద్ సంజీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్, సాజిద్ నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీకి సంగీతం అందించాల్సిన టాలీవుడ్ టాప్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. DSP ప్లేస్ లో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించిన రవి బస్రుర్ ను తీసుకున్నారని అంటున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com