"ఉప్పెన" తో హిట్ సాధించిన పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం "రంగ రంగ వైభవంగా" సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతికా శర్మ వైష్ణవ్ సరసన నటిస్తుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా సెప్టెంబర్ 2, 2022న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ బ్యాంక్రోల్ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు.