హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్టు 13న రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. రోజులు గడిచేకోద్దీ వసూళ్లు తగ్గుతాయి. కానీ ఈ సినిమా మాత్రం ఏరోజుకారోజు అధిక వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75.33 కోట్లు రాబట్టింది. ఈ దూకుడు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరేట్లు కనిపిస్తోంది.
ఈ సినిమా ఇప్పటివరకు 75 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. రూ.100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఆగస్ట్ 25న లైగర్ విడుదల కానున్న ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.