ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఆఫ్ మూవీస్ గా పేరుగాంచిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ చిత్రం ఆగస్ట్ 25, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదల సందర్భం గా చిత్ర యూనిట్ వేగవంతం గా ప్రమోషన్స్ చేస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడం తో ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహించిన టీమ్, ఇప్పుడు లెక్కల మాస్టర్, స్టైలిష్ మూవీ మేకర్ అయిన ఐకానిక్ డైరెక్టర్ సుకుమార్ తో ఇంటర్వ్యూ ను ప్లాన్ చేయడం జరిగింది.
పూరి జగన్నాథ్ తో సుకుమార్ ఇంటర్వ్యూ మేకింగ్ కి సంబంధించిన ఫోటోలను టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు విపరీతం గా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే, ఇంటర్వ్యూ చాలా ఆసక్తి గా ఉండే అవకాశం ఉంది. సినిమా కి సంబందించిన కీలక విషయాలు, మేకింగ్ గురించి పూరి జగన్నాథ్ వివరించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఒక ఇంటర్వ్యూ లో సుకుమార్ పుష్ప ది రైజ్ క్లైమాక్స్ పై ప్రశంసల వర్షం కురిపించిన పూరి జగన్నాథ్ ఈ ఇంటర్వ్యూ తో ఇంకాస్త హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అతి త్వరలో ఈ ఇంటర్వ్యూ ను విడుదల చేయనున్నారు మేకర్స్. లైగర్ చిత్రం లో హీరోయిన్ గా అనన్య పాండే నటించగా, లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలు కాగా, త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.