ఇన్నాళ్లు వాయిదా పడిన కమల్ హాసన్ - శంకర్ ల ఐకానిక్ మూవీ "ఇండియన్" సీక్వెల్ "ఇండియన్ 2" షూటింగ్ కు ఈ రోజు ముహూర్తం కుదిరింది. ఈ రోజు నుండి ఇండియన్ 2 షూటింగ్ షురూ అయినట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
కమల్ హాసన్ - శంకర్ కాంబోలో,1996లో వచ్చిన "ఇండియన్" (తెలుగులో "భారతీయుడు") సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పాతికేళ్ళ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ "ఇండియన్ 2" తెరకెక్కబోతుంది. దర్శకుడు శంకర్ కి, నిర్మాతలకు మధ్య తెలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అండ్ ఈగో క్లాషెస్ వల్ల ఇన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడుతూ వచ్చింది.
రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ పై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ ముఖ్యపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa