నిన్న సాయంత్రం రిలీజైన యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా "రంగరంగ వైభవంగా" ట్రైలర్ యూట్యూబులో మిలియన్ల కొద్దీ వీక్షణలు రాబడుతూ యూట్యూబ్ ఇండియా టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో ఐదవ స్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్ కు 4 మిలియన్ వ్యూస్, 81కే లైక్స్ వచ్చాయి.
యూత్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉన్న ఈ ట్రైలర్ లో మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ ట్రైలర్ అన్ని రకాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కేతికాశర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గిరీశాయ డైరెక్ట్ చేసారు. DSP సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa