ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని విడుదల చెయ్యనున్న "FDFS" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 10:59 AM

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా మూవీ "దసరా" షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా నాని "ఫస్ట్ డే ఫస్ట్ షో" అనే మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం ఐదింటికి విడుదల చెయ్యబోతున్నట్టు ఆ మూవీ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
"ఫస్ట్ డే ఫస్ట్ షో" లో శ్రీకాంత్ రెడ్డి , సంచితా బసు హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. విశేషమేంటంటే, 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్ కేవీ ఈ సినిమాకు కథను అందించారు.
నిన్నటితరం సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పూర్ణోదయా ఫిలిమ్స్ ఈ సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com