ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొరియన్ గర్ల్స్ కలిసి అల్లు అర్జున్ డాన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 11:01 AM

కొరియన్ గర్ల్స్ కలిసి అదిరిపోయే స్టెప్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి తొలిసారి ఓ మ్యూజిక్ కమ్ డ్యాన్స్ వీడియో వచ్చింది. ఇందులో కొరియన్ గ బన్నీ అదిరిపోయే స్టెప్పులేశాడు. "మేము ఆగము.. అసలు ఆగము .." అంటూ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడిన పాటకు బన్నీ స్టెప్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. కోక్ స్టూడియోతో తొలిసారి చేతులు కలిపిన అల్లు అర్జున్.. ఈ మ్యూజిక్ కమ్ డ్యా న్స్ వీడియో చేశాడు. బ్యాగీ ప్యాంట్స్, బ్లాక్ షర్ట్, రెడ్ జాకెట్లో బన్నీ ట్రెండీ లుక్ లో కని పించాడు. ఈ సాంగ్ ను లాస్ట్ స్టోరీస్ & ఎల్లీ కంపోజ్ చేశారు. కునాల్ వర్మ, ఎల్లీ, ఎస్.టైగర్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ను డైరెక్ట్ చేసింది కొలిన్ డీ'కున్యా. ఈ మ్యూజిక్ వీడియోలో అల్లు అర్జున్, అర్మాన్ మాలిక్, కొరియన్ పాప్ గ్రూప్ టైట్ కనిపించారు. ఇక 'పుష్ప 2' త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మెడికల్ మాఫియా నేపథ్యంలో బన్నీ ఓ సినిమా చేయ బోతున్నారనే ప్రచారం జరుగుతోంది.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com