బాలీవుడ్ హీరో సిద్ధార్డ్ మలో తాతో రెండేళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తోంది కియారా అద్వాణీ. త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లిపీటలెక్కబోతున్న ట్లు వార్తలు విని పిస్తున్నాయి. అయితే తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై కియారా, సిద్ధార్డ్ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. లవ్ స్టోరీ గురించి ఎప్పుడూ అడిగిన ఏదో ఒక సమాధానం చెబుతూ దాటవేస్తూ వస్తున్నారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు షాహిద్ కపూర్, తో కలిసి కియారా అద్వాణీ హాజరైంది. ఈ ఎపిసోడ్ ప్రోమో సోమవారం విడు దలైంది. ఇందులో సిద్ధార్డ్ తో లవ్వాట గురించి కరణ్ గుచ్చి గుచ్చి అడగడం... అవునని చెప్పలేను అలాగని కాదని అనను అంటూ కియారా సిగుపడటంచూడొచ్చు. అయితే తమ మధ్య స్నేహానికి మించిన బంధం ఉందంటూ పరోక్షంగా ప్రేమలో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఇక సిద్ధార్డ్ - కియారా జోడిని ఉద్దేశించి షాహిద్ కపూర్ గుడ్ లుకింగ్ కపుల్ అనడంతో మేటర్ అర్థమవుతోంది.