టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “లైగర్”. మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.అయితే ఇక సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ సహా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి మాసివ్ బుకింగ్స్ నమోదు అవుతుండడంతో ఫస్ట్ డే మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు కావడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
అలాగే ఈ సినిమాతో అయితే విజయ్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ నమోదు కావడం ఖాయం అని అంటున్నారు. మరి ఈ సినిమాకి అయితే వరల్డ్ వైడ్ ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి. ఇక ఈ చిత్రంలో అయితే మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా విజయ్ దేవరకొండ ఒక ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నాడు.