దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ల "సీతారామం" ఇండియాలోనే కాక ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్లను రాబడుతుంది. లేటెస్ట్ గా సీతారామం కలెక్షన్లు USA లో 1.25 మిలియన్ మార్కును అందుకుని, 1.5 M మార్కు వైపుకు పరిగెడుతున్నాయి.
హను రాఘవపూడి డైరెక్షన్లో ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మండన్నా, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మురళీశర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.