సినిమాటోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారి తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శివ ఆపై కోలీవుడ్ రంగప్రవేశం చేసి, అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఫేమ్ సంపాదించాడు. తాలా అజిత్ తో శివ తీసిన వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే.
లేటెస్ట్ గా శివ, సూర్య తో ఒక సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు నుండే ఆ మూవీ షూటింగ్ ప్రారంభమైందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. కెరీర్ పరంగా సూర్యకిది 42వ సినిమా. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.