డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ల తొలి పాన్ ఇండియా సినిమా "లైగర్" ఈ రోజే ధియేటర్లలోకొచ్చింది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, లైగర్ ప్రఖ్యాత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. సో, ఆ ఓటిటిలోనే కొన్ని వారాల తదుపరి లైగర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్త బ్యానర్లపై కరణ్ జోహార్, పూరి జగన్నాధ్, చార్మీ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, విషురెడ్డి, మకరంద్ దేశ్ పాండే, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa