శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన హిట్: ది ఫస్ట్ కేస్ మూవీ హిందీలో కూడా అదే పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే కదా. హిందీలో కూడా మంచి విజయం అందుకున్న ఈ మూవీ త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రఖ్యాత ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో హిట్ : ది ఫస్ట్ కేస్ హిందీ ఈ ఆదివారం అంటే ఆగస్టు 28వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తో కలిసి టి - సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించన ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావ్, దంగల్ ఫేమ్ సాన్యా మల్హోత్రా జంటగా నటించారు. హిందీలో కూడా శైలేష్ కొలను దర్శకుడిగా వ్యవహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa